Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే వరుస పండుగ సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా కరోనా కేసులు తగ్గాయి. కాగా, మరోసారి మే 26 తర్వాత కేసులు 24 వేల మార్కును దాటాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 24,296 కరోనా కేసులు, 173 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,51,984కు, మొత్తం మరణాల సంఖ్య 19,757కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 19,349 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,72,357కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,59,335 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 18.04 శాతానికి పెరిగింది.