Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబుల్: అఫ్గానిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చాక అక్కడ పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. వారి హయాంలో మహిళలపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇళ్లలోనే ఉండాలని, భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు, అఫ్గానిస్థాన్ నుంచి తరలింపు ప్రక్రియను అమెరికా ఈ నెల 31 కల్లా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ డెడ్‌లైన్‌ను పొడిగించేందుకు తమ గ్రూపు అంగీకరించదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పష్టంచేశారు. అఫ్గానిస్థాన్‌లో జనజీవనానికి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. అయితే, విమానాశ్రయం వద్ద ఆందోళనకర పరిస్థితులు అందుకు ఆటంకంగా మారాయన్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో అనేకమంది ప్రజలు భయంతో దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.