Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్కూళ్లు, కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు స్టార్టయ్యాక ఏదైనా బడిలో 5 కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైతే వెంటనే ఆ స్కూల్‌ను తాత్కాలికంగా మూసేయాలని విద్య, వైద్య శాఖాధికారులు నిర్ణయించారు. స్టూడెంట్లలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి టెస్టు చేయించాలని చెప్పారు. ఎక్కువ మందికి కరోనా వస్తే ఆ స్కూల్లోని స్టూడెంట్లు, సిబ్బందికి కరోనా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేయించాలన్నారు. ఎక్కువ కేసులు నమోదైన స్కూలు, హాస్టల్‌కు సంబంధించిన వివరాలను కలెక్టర్‌తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌కు పంపించాలన్నారు.
కరోనా రూల్స్ అమలు చేయాలి:
కరోనా రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని డీఈవోలను శ్రీదేవసేన ఆదేశించారు. క్లాస్ రూమ్‌లను రెగ్యులర్‌గా శానిటైజ్ చేయించాలని.. స్కూల్స్, కాలేజీల చుట్టుపక్కల పిచ్చిమొక్కలుంటే పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారుల సాయంతో తొలగించాలన్నారు. స్కూల్ నిర్వహణ పూర్తిగా హెడ్మాస్టర్లదేనని స్పష్టం చేశారు. స్టూడెంట్లు, స్టాఫ్ తప్పకుండా మాస్కు పెట్టుకొని రావాలని ఆదేశించారు.