Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైసీపీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనున్నది. విజయసాయిరెడ్డి కౌంటర్పై నేడు వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ అంశాన్ని కోర్టు విచక్షణకు వదిలేస్తున్నట్లు సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం విదితమే. విజయసాయిరెడ్డి కౌంటర్పై ఇవాళ సీబీఐ కోర్టు ఇరు వాదనలు విని తుది నిర్ణయం వెల్లడించనుంది. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై కూడా సీబీఐ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. జగన్ బెయిల్ రద్దు అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. బెయిల్ రద్దుపై ఇవాళ సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ తీర్పుపై ఇటు తెలుగు ప్రజల్లో, వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.