Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య, నివాస ఇల్లు వంటివి ఏవైనా అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారా? ఇకపై ఆ అంశాల పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, గోడపత్రికలకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఇటువంటి బహిరంగ ప్రచారాలపై ఇప్పటికే నిషేధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. మూసాపేట డివిజన్ పరిధిలోని ఓ దుకాణ యజమాని ఏర్పాటు చేసిన ‘టు లెట్’ స్టిక్కర్‌కు అధికారులు రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తాఖీదు జారీ చేశారు. మోతీనగర్ పరిధి పాండురంగానగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ ఓ మడిగెను సొంత వ్యాపారం నిర్వహణకు వినియోగిస్తున్నారు. దాని పక్కనే ఉన్న మరో మడిగె ఫిబ్రవరిలో ఖాళీ అయ్యింది. దాంతో ఆయన అప్పట్లో ‘టు లెట్’ పేరుతో ఆయన సొంత గోడకు ఓ గోడప్రతిని అంటించారు. దాన్ని నేరంగా పరిగణించిన జీహెచ్ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ అందుకు రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసు అందించారు. 24 గంటల్లో ఈ-చలానా ద్వారా జరిమానా చెల్లించాలని అందులో పేర్కొన్నారు.