Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 53 పాయింట్లు ఎగబాకి 56,012 వద్ద.. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 16,657 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.11 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. లోహ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్ఈ 30 సూచీలో టాటా స్టీల్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కొటాక్మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టైటన్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.