Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కార్వి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కార్వి ఎండీ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించినుంది. కోర్టు ఆదేశాల మేరకు నేడు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. సీసీఎస్ పోలీసులు.. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి బ్యాంకుల నుంచి కార్వి సంస్థ రుణాలు పొందింది. కార్విపై సైబరాబాద్, ఆంధ్రప్రదేశ్లోనూ కేసులు నమోదు అయ్యాయి. నేడు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.