Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడ్చల్: మూడుచింతపల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామంలోని దళితవాడలో నిద్రించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రెండో రోజు ఉదయం రచ్చబండ నిర్వహించారు. దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కాలనీ అంతా కలియ తిరిగి అక్కడికి పరిస్థితులను పరిశీలించారు. పలువురు దళితులు తమ గ్రామ సమస్యలను రేవంత్‌కు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తోందని.. కాలనీలో రోడ్డు ఎత్తుగా వేయడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్‌కు ఫోన్ చేసి మూడుచింతలపల్లి స్థానిక సమస్యలను వివరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్ కోరారు.