Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిన్న ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తిరిగి వచ్చిన 78 మందిలో 16 మందికి కరోనా సోకినట్టు అధికారులు ప్రకటించారు. కరోనా సోకినవారిలో ముగ్గురు సిక్కులు కూడా ఉన్నారు. నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ వారితో కాంటాక్ట్ అయ్యారు. కరోనా సోకిన వారందరికీ ఎలాంటి లక్షణాల్లేవని అధికారులు చెప్పారు. ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వారందరినీ క్వారంటైన్ లో ఉంచనున్నారు. దీంతో వారిని 14 రోజుల పాటు నజఫ్ గఢ్ లోని చావ్లా క్యాంప్ లో క్వారంటైన్ చేయనున్నారు. అందుకు తగిన సౌకర్యాలను ఐటీబీపీ అధికారులు సమకూర్చనున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆర్టీపీసీఆర్ టెస్టులు అవసరం లేకుండానే అందరినీ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఇక్కడికొచ్చాక టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సోకిన వారికి వ్యాక్సిన్ వేశారా? లేదా? అన్నది తెలియదని అధికారులు చెబుతున్నారు.