Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరంపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. సొంత అన్నను తమ్ముడు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. గత కొన్ని రోజులుగా అన్న రాజేశ్.. తమ్ముడు కృష్ణమోహన్‌కు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే అన్నను తమ్ముడు నాటు తుపాకీతో హత మార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.