Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో జగన్‌కు జైలా.. బెయిలా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నేడు తీర్పు వెలువడుుతందని.. ఏం జరుగుతుందో చూడాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఉత్కంఠకు బుధవారం కూడా తెరపడలేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక దీనిపై తీర్పు వచ్చే నెల 15న అయినా వస్తుందో రాదో వేచి చూడాలి.