Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆటోలో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళను ఓ సారి పింటూ పర్మానిక్ అనే యువకుడిని మాస్కు సరిగ్గా ధరించలేదని అడిగింది. దాంతో ఆమెపై అతను కక్ష పెంచుకున్నాడు. ఓ రోజు ఆ మహిళ శ్యామ్పుకుర్ ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు రాగా ఆమెను యువకుడు వెంబడిస్తూ అసభ్య కామెంట్లు చేశాడు. కార్యాలయానికి వెళ్లేందుకు ఆమె ఆటోలో ఎక్కగా అతను కూడా అదే ఆటో ఎక్కి మహిళతో అసభ్యకరంగా ప్రవరించాడు. అది భరించలేని మహిళ.. గిరీష్ పార్క్ క్రాసింగ్ వద్ద మహిళ ట్రాఫిక్ సిబ్బందికి యువకుడిపై ఫిర్యాదు చేసింది. వారు కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.