Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తన భార్య వివాహేతర సంబంధాన్ని మానలేదని అందుకే తానే తన గొంతు కోసి హత్య చేశానని ఓ భర్త.. పోలీసులు ఎదుట లొంగిపోయి నేరాన్పి ఒప్పుకున్నాడు. స్థానికులు, నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగుళూరులో హోసూరు ఎంజీ రోడ్డుకు చెందిన జ్యోతిష్ బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి బెంగళూరు సమీపంలోని జిగణికి చెందిన వందన(25)తో ఏడేండ్ల క్రితం ఓ జరిగింది. వీరికి 6 ఏండ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్త కరోనాకు గురైనప్పుడు అతని షాపులో పనిచేసే సుగిల్ (25) అనే యువకునితో వందన వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది భర్తకు తెలిసి ఆమెను నిలదీశాడు. దాంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. అటునుంచి సుగిల్తో పారిపోయింది. అయితే ఈ నెల 15వ తేదీన భర్త వెళ్లి మళ్లీ భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయినా కానీ వారి మధ్య గొడవ జరగడంతో ఈ నెల 21న వందనను జ్యోతిస్ గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు అనంతరం పోలీసులు ముందు లోంగిపోయి నేరాన్ని అంగీకరించాడు.