Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను టీఎస్ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఆయన ఇంతకు ముందు ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు.
ఇదిలా ఉండగా కమిషనర్ సజ్జనార్ ను అకస్మాత్తుగా బదిలీ చేయడం నిజంగా షాకింగ్ వార్తే. 2019లో సంచలనం సృష్టించిన దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయగా అప్పుడు కమిషనర్ గానే ఉన్న సజ్జనార్ కు ప్రజల నుంచి పలు ప్రశంసలు దక్కాయి. అలాగే కమిషనర్ గా ఆయన విజయవంతంగా విధులు నిర్వర్తించారు.