Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాకిస్తాన్ లోని అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తాలిబన్లతో చేతులు కలిపి కశ్మీర్ ను సొంతం చేసుకుంటామని అధికార పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ నేత నీలమ్ ఇర్షాద్ షేక్ తెలిపారు. తాలిబన్లు తమకు సాయం చేస్తారని చెప్పారని అన్నారు. తాజాగా ఓ టీవీ షోలో ఆమె మాట్లాడుతూ.. తాలిబన్లు తమతోనే ఉన్నారని.. కశ్మీర్‌పై పోరాటంలో పాకిస్థాన్‌తో చేతులు కలుపుతామని వారు ప్రకటించినట్టు చెప్పారన్నారు. దాంతో ఒక్కసారిగా షాక్ కు గురైన టీవీ చానెల్ న్యూస్ యాంకర్ వెంటనే అందుకొని.. 'మేడమ్, మీరు ఏం చెప్పారో తెలుసా? మీకు దాని పరిణామాలు తెలియడం లేదు. ఈ షో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ అవుతోంది... ఇండియాలోనూ అవుతున్నది` అని అన్నారు. అయినా ఇర్షాద్ షేక్ ఏమాత్రం సందేహించకుండా తాలిబన్లు సాయం చేస్తారు అని చెప్పడం గమనార్హం.