Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ముత్తె మల్లవ్వ (112) వయోభారంతో బుధవారం మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లవ్వకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కుమారుడు మృతి చెందాడు. ఆమె ఎక్కువగా సజ్జ, జొన్న రొట్టె, అంబలి, రాగి ముద్ద, పాలు, పెరుగు తింటూ ఆరోగ్యంగా ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు.