Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : క్లీన్, స్మార్ట్ బ్యాంకింగ్‌ను వ్యవస్థీకరించేందుకు ఉద్దేశించిన సంస్కరణల ఎజెండాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ప్రారంభించారు. ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (EASE 4.0) పేరుతో ఈ ఉమ్మడి సంస్కరణల ఎజెండాను ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం రూపొందించారు. ఈ సందర్భంగా మంఇ్ర నిర్మల సీతారామన్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ముంబైలో సమావేశమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక పని తీరును సమీక్షించామని తెలిపారు. స్వయం సమృద్ధ భారత్ ప్యాకేజీ, కోవిడ్-19 సంబంధిత ప్యాకేజీల అమలును సమీక్షించామన్నారు. ఉద్దీపన వేగానికి అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ రుణ వితరణ కృషిని బ్యాంకులు చేపడతాయని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఓ ప్రణాళికను రూపొందించాలని పీఎస్‌బీలను కోరామన్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కరంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ) డిపాజిట్లు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో వ్యాపారాభివృద్ధికి రుణాలు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులను మంత్రి కోరారు.