Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ రోజు సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ముగియగా నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీ సూచీలు మరోసారి ఆల్‌టైం హై దిశగా పయణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్ 56,067 పాయింట్లతో మొదలై ఏకంగా 56,198 పాయింట్లను టచ్ చేసింది. నిఫ్టీ సైతం 16,700 పాయింట్లను క్రాస్ చేసింది. అయితే మధ్యాహ్నం తర్వాత మార్కెట్ క్రమంగా నష్టపోవడం మొదలైంది. సెన్సెక్స్ 55,899 పాయింట్ల కనిష్టానికి చేరగా మార్కెట్ ముగిసే సమయానికి 14 పాయింట్లు నష్టపోయి 55,944 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16,654 పాయింట్లతో ప్రారంభమై 16,712 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 10 పాయింట్ల లాభంతో 16,634 పాయింట్ల వద్ద ముగిసింది.