Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని విశాఖపట్నంలో నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హైవేపై బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. రెండ్డు లారీల మధ్య రెండు కార్లు నలిగిపోయాయి. అయితే ఎవరికీ ఏ పప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని నుంచి ఎలమంచిలి వెళ్లే హైవేపై నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ముందు వేగంగా వెళ్తున్న ఒక ఆటోలోని డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో వెనుక ఉన్న లారీని కూడా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఆపేశాడు. ఆ వెనుక వేగంగా వస్తున్న కారు బ్రేక్ వెయ్యలేక లారీని డీకొట్టింది. ఆ కారును వెనుక వస్తున్న మరో కారు ఢీకొట్టింది. అలాగే ఆ కారును కూడా మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దాంతో రెండు లారీల మధ్య రెండు కార్లు నలిగిపోయాయి. వెనుక ఉన్న కారులో నలుగురు చిక్కుకుని ఆర్తనాదాలు చేశారు. వెంటనే ఎస్ఐ డి.వెంకన్న, సిబ్బంది, పలువురు స్థానికులు కలిసి కారు డోర్లు పగులగొట్టి నలుగురిని బయటకు తీశారు. వారెవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకన్న తెలిపారు.
అయితే నక్కపల్లి సర్కిల్ పరిధిలోని హైవే జంక్షన్లపై మెయింటినెన్స్ పనులు చేయని ప్రాంతంలో హైవేకు ఇరువైపులా ఇష్టానుసారం ఎన్హెచ్ఏఐ సిబ్బంది స్టాపర్స్ను ఎక్కువగా పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.