Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దిశ కేసుకు సంబంధించిన నిందితులు ఎన్ కౌంటర్ కు గురికాగా వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని జుడీషియల్ కమిషన్ ఆదేశించింది. ఎన్కౌంటర్కు గురైన కుటుంబ సభ్యులు బుధవారం కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వారు కమిషన్కు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. దాంతో వారికి తక్షణమే రక్షణ కల్పించాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపు 28 మంది సాక్షులను కమిషన్ విచారించనుంది.