Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కెనడా ప్రధాన కేంద్రంగా టొరంటోలో మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు , 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుగుతుందని కెనడా తెలుగు సంఘాల ఐక్యవేదిక తెలిపింది. వారు మాట్లాడుతూ సెప్టెంబరు 25, 26 తేదిల్లో ఈ సదస్సు వర్చువల్గా నిర్వహిస్తున్నామని, ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కెనడాలో ఉన్న ఎనిమిది తెలుగు సంఘాలు సంయక్తంగా ఈ సాహితి సదస్సును నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సాహితి సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వందకు పైగా ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వీరందరికి అవకాశం కలిగించడానికి సదస్సును రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (ఈఎస్టీ, టోరంటో టైమ్) మొత్తం 20 గంటలకి పైగా ఈ సదస్సు జరుగుతుందని వివరించారు.
ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున ఒక సాహిత్య వేదిక మీద కలుసుకోవడం తమకు తెలిసీ చరిత్రలో ఇదే మొదటి సారి అని అన్నారు.
రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు..
September 25, 2021
YouTube: https://bit.ly/3zcq0O1
Face Book: https://bit.ly/2WhVfsA
September 26, 2021
YouTube: https://bit.ly/3mjgLYS
Face Book: https://bit.ly/3khBrxO