Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లీడ్స్ లో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ లంచ్ సమయానికి 4వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 15 పరుగులతో ఉన్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే రాహుల్ డకౌట్ అవ్వగా ఆ వెంటనే పుజారా 1 పరుగుకు, కోహ్లి 7 పరుగులకు ఔట్ అయ్యారు. అనంతరం రహానే కూడా 18 పరుగులు చేసి ఔట్ అవ్వగా అంపైర్లు లంచ్ విరామం ఇచ్చారు. టాప్ ఆర్డర్ లో నలుగురు నిరాశపర్చడంతో భారత్ కష్టాల్లో పడింది. తర్వాత వచ్చే పంత్, జడేజాలతో కలిసి రోహిత్ ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది.