Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అభ్యంతరకర వీడియోలు చూస్తున్న ఓ బాలికను ఆమె బంధువు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో చేరన్మనగర్లో చోటుచేసుకుంది. బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట పదో తరగతి చదువుతున్న బాలిక అభ్యంతరకర వీడియోలు చూస్తుండటాన్ని వదమధురైకి చెందిన ఆమె బంధువు ఆర్ మూర్తిగా గమనించాడు. అనంతరం తాను చెప్పినట్టు వినకుంటే ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తున్నావని బాలిక తల్లిదండ్రులకు చెబుతానని ఆమెను బెదిరించాడు. అప్పటినుంచి బాలికను పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. రెండు రోజుల క్రితం కూడా బాలిక ఇంటికి వచ్చిన నిందితుడు ఆమె సోదరుడిని క్రికెట్ బాల్ తీసుకురావాలని బయటకు పంపి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడి తీరుతో విసిగిన బాలిక ధైర్యం తెచ్చుకుని విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. సోమవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిపై సెక్షన్ 9, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితున్ని స్పెషల్ పోక్సో కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.