Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసోంలో గౌహతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలుకు చెందిన నాలుగు కోచ్లు పట్టాలు తప్పడంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును ఆపివేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు ప్రకటించారు.
గౌహతి- హౌరా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం హౌరాకు వెళ్తోంది. మధ్యాహ్నం 12 : 20కి ట్రైన్ స్టార్ట్ అయింది. కాగా అసోంలోని చాయ్గావ్ స్టేషన్ సమీపంలో 1 :36 గంటలకు ట్రాక్ మారుతుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే పైలెట్ స్పందించి రైలు ఆపాడు. అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.