Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీచేసింది. సినీ స్టార్లు రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, చార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్, నందు, శ్రీనివాస్‌లకు ఈడీ సమన్లు పంపించింది. పూరీ జగన్నాథ్ ఆగస్ట్ 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా రానా, సెప్టెంబర్ 9న రవితేజ, నవంబర్ 15న ముమైత్ ఖాన్ హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. సెప్టెంబర్ 2 నుంచి 22 తేదీల మధ్యలో వీరిని విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతని సెల్ఫోన్లో లభించిన ఆధారాలను అనుసరించి దర్యాప్తు ప్రారంభమైంది. అప్పట్లో 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.