Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నేషనల్ మానెటైజేషన్ పైప్లైన్ పాలసీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ సచివాలయం వద్ద బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఈ పాలసీని తాము ఖండిస్తున్నామన్నారు. దేశంలోని ఆస్తులను అమ్మేందుకు దీన్ని తీసుకొస్తున్నారన్నారు. ఆ ఆస్తులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీలవేమీ కాదన్నారు. ఈ ఆస్తులు దేశానికి చెందినవని చెప్పారు. ఈ ఆస్తులను అమ్మగా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఖర్చు చేస్తారని ఆరోపించారు. మన దేశ ఆస్తులను అమ్మేసే హక్కును వారికి ఎవరూ ఇవ్వలేదన్నారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యను యావత్తు దేశం సమైక్యంగా వ్యతిరేకిస్తున్నదన్నారు.