Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడి ఎదుటే ఓ యువతిపై ఐదుగురు కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూర్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద నుంచి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎంబీఏ విద్యార్థిని (22) తన స్నేహితుడితో కలిసి రోజూ లాగే బైక్ పై వస్తున్నది. అక్కడ ఐదుగురు వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. వారి వద్ద ఉన్న నగలు, నగదు ఇవ్వాలని అడిగారు. దీనికి నిరాకరించడంతో వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. యువతి ఫ్రెండ్‌ను తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక లైంగికదాడికి ప్పాల్పడ్డారు. వెంటనే బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
డీసీపీ ప్రదీప్ గుంటి మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందన్నారు. బుధవారం ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.