Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దీపావళి టపాసులకు వాడే మందు పేలి ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఇంట్లో దీపావళి టపాసుల మందు సామగ్రిని నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తు అది పేలడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. అతనిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.