Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి బుధవారం తొడగొట్టి సవాలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గురువారం తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా పీసీసీ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. రేవంత్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రేవంత్ ఓడితే ముక్కు నేలకు రాయాలన్నారు.
మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని చెప్పారు. అయితే అందులో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్లో కేంద్రమే ప్రకటించిందని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మూడుచింత లపల్లిలో 62 కోట్ల రూపాయలతో అన్ని రకాల అభివృద్ధి చేశామన్నారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని చెప్పారు. దమ్ముంటే తాను కబ్జా చేసినట్టు రేవంత్ నిరూపించాలన్నారు.