Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెట్రోల్ ధరలను భరించలేక విసుగెత్తిపోయిన ఓ రైతు తన బైక్ కు నిప్పంటించి దహనం చేశాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కుర్వ ఆంజనేయులు బుధవారం స్థానిక వైఎస్ఆర్ చౌరస్తాలో అకస్మాత్తుగా తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు. స్థానికులు గమనించి బైక్ పై నీరుపోసి మంటలను ఆర్పారు. దహనం చేసిన వ్యక్తి మాట్లాడుతూ తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. పెట్రోల్ ధరలు పెరగడంతో అది భరించలేక బైక్ ను దహనం చేశానని తెలిపాడు. పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అతని ఇంటి దగ్గర వదిలిపెట్టారు.