Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీ గా బదిలీ చేసి సైబరాబాద్ కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్ర ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో వీసీ.సజ్జనార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు.
స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత.. సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీపై దృష్టి సారిస్తానని చెప్పారు. రాష్ట్రంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు.