Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కన్నడిగుల సాంస్కృతిక రాజధాని మైసూరు నగర శివారులోని చాముండి కొండల దిగువన ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి చాముండి కొండల దిగువన ఉన్న లలితాద్రిపుర ప్రాంతానికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆరుగురు కామాంధులు వారిని వెంబడించారు. స్నేహితుడిని తీవ్రంగా గాయపరచి యువతిపై సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్నేహితుడి సాయంతో ఆ యువతి సమీపంలోని ఆసుపత్రిలో చేరారు. విషయాన్ని తెలుసుకున్న డీసీపీ ప్రదీప్ గుంటి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలనహళ్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.