Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా సినీ ఫక్కీలో పెండ్లి పందిరి నుంచి పెళ్లికూతురు పరారైన సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా ఎన్పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు(26), తంబళ్ళపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇరుకుటుంబాల వారు మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి వధూవరులకు నలుగు పెట్టారు. పెండ్లికుమార్తె రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పరారైంది. తమకు అవమానం జరిగిందని పెండ్లి కొడుకు, బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెండ్లికూతురు మైనర్ అని తేలింది. కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ ఎస్సై లోకేష్ దర్యాప్తు చేస్తున్నారు.