Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కార్వీ మోసాలపై సీసీఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎండీ పార్థసారథిని రెండో రోజు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. కార్వీ స్కాంపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఈడీకి సీసీఎస్ లేఖ రాసింది. మనీ హవాలాతోపాటు, మనీలాండరింగ్ జరిగినట్లు సీసీఎస్ పేర్కొంది. కస్టమర్ల షేర్లను తాకట్టుపెట్టి రూ.2100కోట్ల పైచీలుకు రుణాలు పొందినట్టు నిర్ధారణ అయింది. తీసుకున్న రుణాన్ని వ్యక్తిగత కంపెనీలకు మళ్లించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. రియాల్టీతోపాటు ఇన్ఫోటెక్ కంపెనీలకు పార్థసారథి నిధులు మళ్లించారు. నిధుల మళ్లింపు, ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఈడీకి లేఖ రాశారు. డీ మాట్ అకౌంట్ ఖాతాదారుల డిపాజిట్లను తనఖా పెట్టి.. బ్యాంకుల నుంచి పార్థసారథి రుణం తీసుకున్నారు.