Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9.23 నిమిషాలకు సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 55,894 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 16,615వద్ద ఉన్నాయి. కామా హోల్డింగ్స్,వింద్యా టెలిఇంక్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్,ఐఎస్జీఈసీ హెవీ ఇంజినీరింగ్, ప్రికోల్ లాభాల్లో ఉండగా.. జైన్ ఇరిగినేష్, లిండే ఇండియా, టీసీఎన్ఎస్ క్లోతింగ్,పీఅండ్‌జీ హైజీన్, కల్యాణి స్టీల్ నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా పవర్ సూచీ 1.43శాతం లాభపడగా.. టెలికామ్ సూచీ అత్యధికంగా 0.13శాతం నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ0.04పైసలు లాభపడి రూ.74.02 వద్ద కొనసాగుతోంది. దక్షిణ కొరియా వడ్డీరేట్లను పెంచింది. కరోనా సమయంలో వడ్డీ రేట్లను పెంచిన తొలి దేశం ఇదే.