Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం... కొంతకాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్ -3లో కమర్ అనే వ్యక్తి ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి సదరు ఇంటిపై దాడి చేశారు. ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్తబ్రాష్(26), చింతలకుంట వాసి షేక్‌నబీ(32), హజెర్నగర్కు చెందిన మహ్మద్సమీర్(40), అంబర్‌పేట వాసులు షేక్నజీర్(32), ఎండీ.తబ్రాష్(34), షేక్హాజీ(27), సంతో్‌షనగర్‌కు చెందిన ఎండీ.సర్ఫరాజ్(23), బహదూర్‌పూరా వాసి సయ్యద్ఇబ్రహీం(41), మలక్‌పేటకు చెందిన ఎండీ.అజర్(30), రామాంతపూర్ వాసిసయ్యద్సయీద్(29), యాఖుత్పూరాకు చెందిన షేక్‌రషీద్(25), ఎండీ.అరీ్ఫ(40)లను అరెస్టు చేశారు. రూ.1,27,460లు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తునూ ఎల్బీనగర్ పోలీ్‌స స్టేషన్లో అప్పగించారు.