Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ తెస్తేనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే జైలు పార్టీ, బెయిల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ తీరుపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశనని చెప్పారు. ఆయనది ఐరన్ లెగ్ అని, ఏ పార్టీలో చేరితే అది నాశనమవుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చని, అయితే దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు వద్దని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసింటే ఇప్పుడు మా అవసరం ఏమొచ్చేదన్నారు.