Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. వైకాపా నుంచి మిథున్‌రెడ్డి, టీడీపీ తరఫున గల్లా జయదేవ్, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు సహా ఇతర అంశాలను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతలకు వివరించనున్నారు.