Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: దేశం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది ఎం.ఎల్. శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. అక్రమ రవాణా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఖనిజం అక్రమ రవాణాపై కేంద్రం స్పందించాలని సీజేఐ నిర్దేశించారు. దీనిపై రెండు వారాల్లో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు.