Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను ఇక నేటి నుంచి నిలిపివేస్తున్నట్టు అమెరికాకు చెందిన వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ ప్రకటించింది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అయితే తమ మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆ సంస్థ ప్రకటించింది. యాహూ గురువారం ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయలేదు. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని తెలిపింది.