Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124
— Fred Schultz (@fred035schultz) August 24, 2021
Authorization
Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124
— Fred Schultz (@fred035schultz) August 24, 2021
హైదరాబాద్ : రోబో 2.0 సినిమాలో ఫోన్ల వచ్చే రేడియేషన్ల వల్ల పక్షులు చనిపోతున్నాయనిరేడియేషన్ను తగ్గించాలని పక్షిరాజు అనే వ్యక్తి టెలీకాం కంపెనీలతో, ప్రభుత్వంతో పోరాడతుంటాడు. ఆ సినిమాలో పక్షులు రేడియేషన్ మూలంగా ఎలా అంతరించిపోతున్నాయో చూపించారు. అయితే నిజ జీవితంలో కూడా ఓ పక్షికి ఈ రేడియేషన్ గురించి తెలిసినట్టుంది. ఏకంగా ఓ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ ను లాక్కెళ్లింది. అలాగే వెళూతూ కెమెరా ఆన్ చేసి వీడియో కూడా తీసింది. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడండి.
పూర్తి వివరాల్లోకెళ్తే.. ఓ కుర్రాడు తన ఇంటి దగ్గర ఫోన్ పట్టుకుని ఉండగా ఓ రామచిలుక దాన్ని కాలి గోళ్లతో ఫోన్‌ను పట్టుకుని ఎగిరిపోయింది. అదే సమయంలో.. ఫోన్ కెమెరా ఆన్ అయి రికార్డవడం స్టార్ట్ అయింది. ఇక అది ఎగురుకుంటూ వెళ్తూంటే వీడియో రికార్డయింది. కాసేపు అటూ ఇటూ తిరిగి చివరకు ఓ కారు మీద ఆగింది. అప్పుడు కానీ.. ఆ ఫోన్ రికార్డింగ్ ఆగలేదు. మొత్తం మీద దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రోన్‌ను మించిన వీడియో ఇది... పక్షి వ్యూ ఇది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.