Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా దిశ యాప్ ద్వారా స్పందించిన అధికారులు ఆమెను కాపాడురు పూర్తి వివరాల్లో కెళ్తే.. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడకు చెందిన ఓ మహిళ దిశ ఎస్ఓఎస్కు ఓ సమాచారం పంపింది. అందులో ప్రేమ పేరుతో తాను నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను మోసం చేశాడని, సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. తన కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలని కోరింది. దానికి వెంటనే దిశ కంట్రోల్ రూం సిబ్బంది స్పందించారు. మహిళ ఫోన్ నెంబరు ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. మహిళ ఉన్న ప్రదేశానికి సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే మహిళ విషం తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. దాంతో ఆమెను ప్రయివేటు ఆస్పత్రికి తరలించిగా ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు మహిళతో పాటు అయిదు సంవత్సరాల బాలికను చేరదీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.