Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజాప్రతినిధులు, నాయకులు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. వారు ఒక పార్టీ అయితే ఏకంగా మరో పార్టీ కి జై కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా అలాగే నోరు జారారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను నిజమైన లబ్దిదారలకు అందేలా తెలుగుదేశం(టీఆర్ఎస్ అనబోయి) ప్రజాప్రతినిధులు, తెలుగు దేశం నాయకులు కృషి చేయాలని అన్నారు. వెంటనే పక్కనున్నవాళ్లు గుర్తించి చెప్పడంతో ఎమ్మెల్యే మాట సరిచేసుకున్నారు.