Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలో గత 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,539 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. అలాగే 12 మంది కరోనాతో మృతి చెందగా 1,140 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,448 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,07,730కి చేరగా 19,79,504 మంది డిశ్చార్జ్ అయ్యారు. 13,778 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటివరకు 2,63,37,946 కరోనా పరీక్షలు నిర్వహించారు.