Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్ణాటకలోని మైసూర్ శివార్లలో ఓ విద్యార్ధినిపై ఆరుగురు కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి కర్నటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడ బాధితురాలు ఏం చేస్తోందని మంత్రి ప్రశ్నించారు. ఆమె అక్కడికి అతని స్నేహితునితో కలిసి వెళ్లాల్సింది కాదన్నారు. అయితే ఎవరు ఎక్కడికి వెళ్లినా ఎవరమూ ఆపలేమన్నారు. అలాగే సామూహిక లైంగిక దాడి ఘటన అమానుషమన్నారు. ఇది సున్నిత సమస్య అని ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ తమపై బురద చల్లుతోందని మంత్రి ఆరోపించారు. మైసూర్లో లైంగిక దాడి ఘటన జరిగితే కాంగ్రెస్ పార్టీ తనపై లైంగిక దాడికి ప్రయత్నిస్తోందన్నారు.
మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని అన్నారు. పార్టీ మొత్తం మంత్రి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు.