Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్‌ను నియమితులయ్యారు. ఆయన నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈడీగా పదోన్నతికి ముందు అజయ్ న్యూఢిల్లీలోని రీజనల్ డైరెక్టరేట్‌లో రీజనల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఆయన మూడు దశాబ్దాలుగా ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ సూపర్ విజన్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్, కరెన్సీ మేనేజ్మెంట్, ఆర్బీఐలోని ఇతర విభాగాల్లో పనిచేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి అజయ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఇక్ఫాయ్ నుంచి ఎంఎస్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, రీసెర్చ్ నుంచి సర్టిఫైడ్ బ్యాంక్ మేనేజర్ కోర్సులు చదివారు. చికాగోలోని కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తిచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్టిఫైడ్ అసోసియేట్‌తో పాటు ఇతర వృత్తిపరమైన అర్హతలు కూడా అజయ్ కలిగి ఉన్నారు.