Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలో జరిగిన దళిత, గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తవ్వుకున్నాడని, ఆ బొందను తామే పూడుస్తామన్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామన్నారు. సీఎంఓలోకి రాహుల్ బొజ్జకు చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అప్పుడు కేసీఆర్ కూతురుకు టికెట్ ఇవ్వాలని తాను ఆమెను గెలిపిస్తానని చెప్పారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలేకనే కోకాపేట భూములను కేసీఆర్ అమ్మాడని.. బ్రోకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.