Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వంతో అచ్చేదిన్ కాదు.. సచ్చే దిన్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థలను కూలదోస్తుందని, రోడ్డు మార్గాలు, నౌకశ్రయాలను, రైల్వేలను కుదవ పెడుతోందన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులంతా హుజూరాబాద్‌కు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఈటల అనడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ప్రచారం చేయవచ్చని తెలిపారు.