Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అస్థికలు కోసం శ్మశానవాటికలో ఓ రెండు కుటుంబాలు గొడవపడ్డాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట శ్మశాన వాటికలో గురువారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని వాణి నగర్‌కు చెందిన కల్లెడ పోచమ్మ మంగళవారం మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు అదే రోజు ఉదయం చింతకుంట శ్మశాన వాటికలో ఉన్న ఓ దహన వేదికపై అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన జంగిలి భీమయ్య కూడా మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. దాంతో ఆయన కుటుంబసభ్యులు కూడా అదే రోజు రాత్రి సమయంలో అదే దహన వేదికపైనే అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల అనంతరం మృతుల కుటుంబ సభ్యులు అస్థికల కోసం శ్మశాన వాటికకు వచ్చారు. అస్థికలు సేకరించే విషయంలో రెండు కుటుంబాల మధ్యవివాదం చోటు చేసుకుంది. అస్తికలు మావంటే.. మావి అంటూ కొట్లాటకు దిగారు.
విషయాన్ని ఆరా తీయగా శ్మశాన వాటికలో విధులు నిర్వహించే వాచ్‌మన్ నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని తెలిసింది. చివరికి రెండు కుటుంబాల వారు తలా కొన్ని అస్థికలు తీసుకుని వెళ్లిపోయారు.