Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2018లో హనుమ కొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలపై కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణకు వారు హాజరుకాలేదు. దాంతో ప్రజాప్రతి నిధులు కోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి హాజరుపర్చాలని ఆదేశించింది.
అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వడంతో బలరాం నాయక్ ప్రజా ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. దాంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు ఉపసంహరించింది. విచారణను వచ్చేనెల 3కి వాయిదా వేసింది.